గొంతు ఎత్తదు గాడిద కొన్ని గడ్డిపోచలు విసిరివేస్తే,
మనిషివి నీకేమి రోగమురా ?
డబ్బు పారేస్తే గాడిదల మూగపోతావు,
గర్జించును గాడిద కూడా గడ్డిపోచలు లాక్కుంటే,
మనిషివి నీకేమి రోగమురా ?
నీ బ్రతుకు లాక్కుంటే పెదవైన కదపవ్వు ?
చావచచ్చితివా సన్నాసి వెదవ!
ఒకడొచ్చి డబ్బు విసిరితే మూగపోతావు,
కంటతడి మరిచి డబ్బు కంట్టికద్దుతావు,
ఒకడొచ్చి డబ్బు లాక్కున మూసుకుంటావు,
కష్టాలు కొత్తేమీ కాదులే అని ఉర్కుంటావు,
ఎవడో మనకు డబ్బు పారేస్తే ఒక లెక్క మూసుకుంటావు,
మన డబ్బు ఎవడో లాక్కుంటే అదే లెక్కన్న మూగాపోతావు,
గాడిదకు ఉన్న లెక్క నీకు లేదు కదరా!
డబ్బుకోసం అన్యాయాన్ని దాచమాకురా,
న్యాయంకోసం గొంతు తెరిచి అరవరా...
- krtrstate
#krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes